AP: గిరిజనులకు మంత్రి దుర్గేష్ శుభవార్త అందించారు. 1/70 గిరిజన చట్టాన్ని సవరించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని తెలిపారు. ఈ చట్టాన్ని పరిరక్షిస్తూనే గిరిజన ప్రాంతాల్లో పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. పర్యాటకంలో గిరిజనులనూ భాగస్వాములను చేసి వారి ఆదాయాన్ని పెంచుతామన్నారు. గిరిజన ప్రాంతాల్లో పర్యాటకాభివృద్ధికి కేంద్రం ఒక ప్రత్యేక పథకాన్ని తీసుకొస్తోందని మంత్రి స్పష్టం చేశారు.