సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పెళ్లి వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. కెనడాకు చెందిన ఓ భారత సంతతి జంట భారత్‌లో పెళ్లి వేడుకలు జరుపుకుంది. అయితే, ఫోటోల్లో ఎఫెక్ట్ కోసం వారి పక్కన ఏర్పాటు చేసిన కలర్ బాంబ్ వధువు వీపుపై పేలింది. దీంతో ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనను ఆ జంట తమ ఇన్‌స్టాలో పంచుకుంది.