విజయవాడ వాసులకు బుడమేరు వాగు గండం ఇంకా పొంచి ఉంది. భారీ వర్షాలకు పులి వాగు, బుడమేరు వాగులకు వరద ప్రవాహం పెరుగుతోంది. వాగుకు గండ్లు పడి మళ్లీ వరద ముంచుతుందేమోనని ప్రజలు భయపడుతున్నారు. ఈ మేరకు అధికారులు విజయవాడలోకి వరద రాకుండా బుడమేరు వద్ద నిన్న పూడ్చిన గండ్ల ఎత్తును పెంచుతున్నారు. మరోవైపు విజయవాడలో ఇవాళ ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది.