అమెరికాలో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఆగ్నేయ కెంటుకీలో అంతర్రాష్ట్ర 75 హైవే వెంబడి శనివారం "అనేక మంది వ్యక్తుల"పై కాల్పులు జరిగాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఏడుగురు గాయపడ్డారని పలు వార్తా కథనాలు పేర్కొన్నాయి. అయితే, బాధితుల్లోని కొందరు తుపాకీ కాల్పుల వల్ల కాకుండా, వాహన ప్రమాదంలో గాయపడ్డారని మరికొన్ని నివేదికలు పేర్కొన్నాయి. ఈ ఘటనలో అనుమానితుడైన 32 ఏళ్ల జోసెఫ్ ఏ కౌచ్ పరారీలో ఉన్నట్లు సమాచారం.