AP: రాజధాని అమరావతిలో చేపట్టాల్సిన పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సీఆర్డీఏ ఆమోదించిన 20 సివిల్ పనులకు ఆమోద ముద్ర వేస్తూ సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ పనులకు రూ.11,467 కోట్ల మేర వ్యయం అవుతుందని పేర్కొంది. ప్రపంచ బ్యాంకు, అభివృద్ధి బ్యాంకు సంయుక్తంగా ఇవ్వనున్న రుణంతో ఈ పనులు చేపట్టేలా కార్యచరణ రూపొందించారు.