తిరుమలలో పవన్ కళ్యాణ్.. వాహనాలు నిలిపివేత

53చూసినవారు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షను తిరుమలలో విరమించనున్నారు. మంగళవారం కాలినడకన తిరుమలకు బయల్దేరారు.. రాత్రికి తిరుమల చేరుకుంటారు. రెండు రోజుల పాటు పవన్ తిరుమలలోనే ఉండనున్నారు. బుధవారం ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. అయితే పవన్ పర్యటన నేపథ్యంలో టీటీడీ, పోలీసులు అత్యుత్సాహం చూపించారు. కాలినడకన పవన్ వెళ్తుండగా ఘాట్‌రోడ్డులో వెళ్లే వాహనాలు నిలిపివేశారు. అరగంట పాటు వాహనాలు నిలిపివేయడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్