సినీ నటుడు రజనీకాంత్ ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ బులెటిన్‌ను అపోలో ఆస్పత్రి వర్గాలు విడుదల చేశాయి. ఆయన హృదయ నాళానికి సంబంధించి చికిత్స చేసినట్టు వెల్లడించాయి. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, మరో రెండు రోజుల్లో డిశ్ఛార్జి అవుతారని తెలిపాయి. కాగా, తీవ్ర కడుపునొప్పితో రజనీకాంత్ సోమవారం రాత్రి ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. వైద్యులు ఆయన గుండె నాళంలో సమస్య ఉన్నట్టు గుర్తించి స్టెంట్ వేశారు.