వైసీపీ అధినేత జగన్ తీరుపై ఏపీ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ వేదికగా ఫైర్ అయింది. రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలను జగన్ గాలికి వదిలేశారంటూ మండిపడింది. ఇటీవల కురిసిన వర్షాలకు పంట దెబ్బతిన్న రైతులను కనీసం పట్టించుకోలేదని ధ్వజమెత్తింది. మెయిన్ లైన్ వదిలేసి లూప్ లైన్‌లో బండిని తీసుకెళ్లి పట్టాలు తప్పించుకునేలా వైసీపీ వాళ్ల ప్రవర్తన ఉందని ఏపీ కాంగ్రెస్ ఎద్దేవా చేసింది.