ఏపీ డిప్యూటీ సీఎంకు షాక్.. షిప్ సీజ్ చేయడం సాధ్యం కాదన్న కలెక్టర్

53చూసినవారు
ఏపీ డిప్యూటీ సీఎంకు షాక్.. షిప్ సీజ్ చేయడం సాధ్యం కాదన్న కలెక్టర్
కాకినాడ పోర్టులో స్టెల్లా నౌక వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. స్టెల్లా షిప్‌ను సీజ్ చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే షిప్ సీజ్ చేయడం కుదరదని కాకినాడ కలెక్టర్‌ షాన్‌ మోహన్‌ పరోక్షంగా తేల్చేశారు. అసలు రేషన్ బియ్యం ఎక్కడి నుంచి తీసుకొచ్చారు..? ఎక్కడ నిల్వ చేశారనే దానిపై దర్యాప్తు జరుగుతోందని అది తేలే వరకు సీజ్ చేయడం కుదరదని కలెక్టర్ వెల్లడించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్