వాలంటీర్ల‌కు శుభ‌వార్త‌.. జీతాలు పెంపు

327352చూసినవారు
గ్రామ/వార్డు వాలంటీర్ల‌కు ఏపీ ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్పింది. వాలంటీర్ల‌కు రూ.750 అదనంగా ఇవ్వబోతున్నామ‌ని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వెల్ల‌డించారు. ఇవాళ సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రకటన చేస్తున్నామ‌న్నారు. ప్రజలకు రేషన్ పకడ్బందీగా ఇప్పిస్తున్నందుకు ఈ నిర్ణయం తీసుకున్నామ‌ని చెప్పారు. జనవరి 1 నుంచే ఇది అమలవుతుంద‌ని చెప్పారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంత‌రం ఆయ‌న ఈ మేర‌కు మీడియాతో మాట్లాడారు.