మైనర్లకు పెన్షన్ పథకం.. బడ్జెట్ లో ‘NPS-వాత్సల్య’

80చూసినవారు
మైనర్లకు పెన్షన్ పథకం.. బడ్జెట్ లో ‘NPS-వాత్సల్య’
పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఇప్పటినుంచే పొదుపు చేసేలా కేంద్ర ప్రభుత్వం ఎన్‌పిఎస్-వాత్సల్య రూపంలో ఓ పథకం ప్రారంభించనుంది. ఈ మేరకు కొత్త పింఛను విధానంలో మార్పులు చేసింది. పెన్షన్ పథకంలో మైనర్లనూ చేర్చేలా ‘ఎన్‌పిఎస్-వాత్సల్య'ను ప్రారంభించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. ఈ పథకంతో మైనర్ల తల్లిదండ్రులు లేదా సంరక్షకులు పిల్లల పేర్లపైనా పెట్టుబడులు పెట్టొచ్చని ఆమె తెలిపారు.

సంబంధిత పోస్ట్