ఏపీలో మరోసారి నామినేటెడ్ పదవులపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ నెలాఖరు, వచ్చే నెల మొదటి వారంలో నామినేటెడ్ పదవులు భర్తీ చేసే అవకాశం ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రాథమిక వ్యవసాయ సొసైటీలు, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలు, వివిధ కార్పొరేషన్ ఛైర్మన్, డైరెక్టర్లు, దేవాలయాల పాలక మండళ్లపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. టీడీపీకి 80 శాతం, జనసేనకు 15 శాతం, బీజేపీకి 5 శాతం లెక్కన పదవులు కేటాయించే విధంగా కసరత్తు చేస్తున్నారు.