ఏపీలో కూటమి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం ఇవ్వాలంటూ టీడీపీలో పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. 'లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయమని అడగడానికి రాజకీయ నాయకులు ఎవరు?. ఆ విషయాన్ని ప్రజలు నిర్ణయించాలి' అని అయ్యన్న పాత్రుడు తెలిపారు. కాగా, స్పీకర్ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.