బూడిద తెగులు: ఆకు పైభాగంలో తెల్లని పొడి లాగా ఏర్పడుతుంది. ఉద్ధృతి ఎక్కువైతే కాండం, పూతపై కూడా ఈ పొడి కనిపిస్తుంది. చివరకు ఆకులు, కాండం ఎండిపోతాయి.
ఆకుమచ్చ తెగలు: ఆకుల మీద చిన్న గుండ్రని మచ్చలు ఏర్పడి తెగులు ఉద్ధృతి ఎక్కువయ్యే కొద్దీ ఇవి పెద్దగా మారి ఆకు ఎండిపోతుంది.
వెర్రి తెగులు: ఆకులలో ఈనెలు ఉండే ప్రాంతంలో చారలు ఏర్పడతాయి. మొక్క అంతా గిడస బారిపోతుంది. పూత తగ్గుతుంది.