ఏపీ కేబినెట్ నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియాకు వివరించారు. ఆక్రమణలకు గురైన అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్లో నిర్మించుకున్న పేదల ఇళ్లను క్రమబద్ధీకరించనున్నట్లు ఆయన వెల్లడించారు. వీరు 2019, అక్టోబర్ 15 నాటికి దరఖాస్తు చేసుకుని ఉండాలని తెలిపారు. అలాగే గత ప్రభుత్వం ఇచ్చిన లేఅవుట్లలో పలు కారణాలతో ఇళ్లు నిర్మించుకోని వారి పట్టాలను రద్దు చేస్తున్నామన్నారు. అలాంటి వారికి కోరుకున్న చోట ఇళ్లను నిర్మించి ఇస్తామని చెప్పారు.