నందమూరి బాలకృష్ణ ఇవాళ అమెరికాలోని డల్లాస్ వేదికగా జరిగే ‘డాకు మహారాజ్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్, ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో సందడి చేయనున్నారు. ఈ నేపథ్యంలో డల్లాస్‌లోని బాలయ్య అభిమానులు కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా, ఈ సినిమా సంకాంత్రి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.