AP: మూడు రోజులు తేలికపాటి వర్షాలు

57602చూసినవారు
AP: మూడు రోజులు తేలికపాటి వర్షాలు
రాయలసీమ ప్రాంతంపై మంగళవారం నుంచి ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంద‌ని భారత వాతావరణ విభా­గం(ఐఎండీ) వెల్ల‌డించింది. ఇది సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి ఉందని తెలిపింది. ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న మూడు రోజు­లు కోస్తాంధ్ర, రాయలసీమల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది. ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా సంభవించే అవకాశం ఉందని వివ‌రించింది.

సంబంధిత పోస్ట్