కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ భేటీ అయ్యారు. జాతీయ ఆరోగ్య మిషన్ , ఇతర పథకాల కింద రాష్ట్రానికి అదనంగా రూ.259 కోట్లు కేటాయించాలని కోరారు. అలాగే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రూ.800 కోట్ల మేరకు పునఃకేటాయింపుల కింద అదనపు నిధుల్ని కేటాయించాలని కోరారు. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి, క్యాన్సర్ చికిత్సల విషయంలోనూ అదనపు సాయం మంజూరు చేయాలని కోరారు.