బంగ్లాదేశ్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ మార్చి 24న ఢాకా ప్రీమియర్ లీగ్ ఆడుతుండగా గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇక్బాల్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం కుదుటపడటంతో శుక్రవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక డీపీఎల్ 2025లో మహమ్మదన్ స్పోర్టింగ్ క్లబ్‌కు తమీమ్ నాయకత్వం వహిస్తున్నాడు.