యూపీలోని లక్నోలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. కుర్చీ కోసం బీజేపీ నేతలు దారుణంగా కొట్టుకున్నారు. మొరాదాబాద్‌లో ఇటీవల ఓ కార్యక్రమం జరగగా బీజేపీ నేతలు హాజరయ్యారు. అయితే చీఫ్ గెస్ట్ కుర్చీలో కూర్చోడానికి బీజేపీ మాజీ ఎమ్మెల్యే రాజేష్ కుమార్ సింగ్, పార్టీ బ్లాక్ ప్రెసిడెంట్ రాజ్‌పాల్ సింగ్ మధ్య గొడవ పడ్డారు. ఒకరిపై ఒకరు కుర్చీలు, బాటిళ్లు విసురుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.