ఏపీ రెవెన్యూ సదస్సులు వాయిదా: మంత్రి అనగాని

67చూసినవారు
ఏపీ రెవెన్యూ సదస్సులు వాయిదా: మంత్రి అనగాని
ఈ నెల 16 నుంచి నిర్వహించాల్సిన రెవెన్యూ సదస్సులను సెప్టెంబర్ మొదటి వారానికి వాయిదా వేస్తున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఉద్యోగుల బదిలీల ప్రక్రియ పూర్తైన తర్వాత వీటిని నిర్వహిస్తామని వెల్లడించారు. పాత అధికారులతోనే నిర్వహిస్తే సరైన ఫలితాలు రావన్నారు. ఇందులో భూ వివాదాలు, రీసర్వేలో జరిగిన తప్పిదాలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, 45 రోజుల్లో తగు చర్యలు తీసుకుంటామని వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్