AP: శుభ‌వార్త చెప్పిన రాష్ట్ర ప్ర‌భుత్వం

195635చూసినవారు
AP: శుభ‌వార్త చెప్పిన రాష్ట్ర ప్ర‌భుత్వం
కొత్తగా రేష‌న్ కార్డులు మంజూరైన వారికి ఏపీ ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్పింది. కొత్త కార్డులు ఇంకా అంద‌క‌పోయినా.. సంక్రాంతి పండుగ నేప‌థ్యంలో వీరికి ఈ నెల నుంచే రేషన్ అందించాల‌ని నిర్ణ‌యించింది. ఈ మేర‌కు కార్డులు ఇంకా అందకున్నా.. జాబితాలో పేరు ఉన్నవారి ఆధార్ ఆధారంగా రేషన్ తీసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, తాజాగా 1,11,321 కొత్త రేషన్ కార్డులను స‌ర్కార్ మంజూరు చేయ‌గా.. పంపిణీ కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంది.

సంబంధిత పోస్ట్