AP: వైసీపీ హయాంలో మంత్రులుగా పనిచేసిన రోజా, రజినిపై అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆడుదాం ఆంధ్రా పేరుతో కోట్ల రూపాయలు దారిమళ్లించారని రోజా ఆరోపణలు ఎదుర్కొంటుండగా.. బెదిరించి డబ్బులు వసూలు చేశారని తాజాగా విడదల రజినిపై ఏకంగా ఏసీబీ కేసు నమోదైంది. అయితే ఈ ఇద్దరిలో ముందుగా కోర్టు బోనెక్కేదెవర చర్చనీయశం అవుతోంది. ఈ లెక్కన వైసీపీ హయాంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ లను తిట్టినవారిని జైలుకి పంపించాల్సి వస్తే మొదట ఆ లిస్టులో మాజీ మంత్రి రోజా ఉంటుందని చెప్పుకుంటున్నారు.