రాష్ట్రాలతో చర్చించాకే డీలిమిటేషన్‌పై ముందుకెళ్లాలి: కేకే

56చూసినవారు
రాష్ట్రాలతో చర్చించాకే డీలిమిటేషన్‌పై ముందుకెళ్లాలి: కేకే
రాష్ట్రాలతో చర్చించాకే కేంద్రం డీలిమిటేషన్‌పై ముందుకెళ్లాలని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్‌లో చట్టం ఆమోదం పొందాకే కేంద్రం డీలిమిటేషన్‌ చేయాలన్నారు. పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల భాగస్వామ్యం ఇంకా పెరగాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. కొన్ని రాష్ట్రాలు సీట్లు గురించి కాకుండా.. పార్లమెంటులో తమ గళానికి ప్రాధాన్యత ఉండాలని అంటున్నాయని కేకే అన్నారు.

సంబంధిత పోస్ట్