లిఫ్ట్ ఇస్తానని బైక్ ఎక్కించుకొని.. కర్రతో దాడి (వీడియో)

71చూసినవారు
పిఠాపురంలోని ఇల్లిందరాడ జంక్షన్ సమీపంలో వృద్ధుడిపై కర్రతో దాడి చేసి రూ.10 వేల నగదు దోచేశారు. చేబ్రోలుకు చెందిన పెండ్యాల రామకృష్ణ పిఠాపురంలో పని ముగించుకొని ఇంటికి వెళ్తున్నాడు. లిఫ్ట్ ఇస్తానంటూ రామకృష్ణను ఓ వ్యక్తి బైక్ ఎక్కించుకున్నాడు. ఇల్లిందరాడ జంక్షన్ దగ్గరికి రాగానే రామకృష్ణపై దాడి చేసి నగదు కాజేసి పరారయ్యాడు. ఈ ఘటనపై రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్