AP: అనంతపురం జిల్లా విడపనకల్లు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొట్టాలపల్లి వద్ద ప్రమాదం
మహిళా కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాద ఘటనలో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. పోలీసులు కేస్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.