తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు రవికుమార్(71) శుక్రవారం ఉదయం కన్నుమూశారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన చెన్నైలోని వేలచేరిలోని ప్రశాంత్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తను కుమారుడు తెలియజేశారు. రేపు రవికుమార్ అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. అలాగే రవికుమార్ 100కి పైగా చిత్రాల్లో నటించారు.