AP: విజయవాడ జిల్లా కొత్తపేట పీఎస్ పరిధిలో దారుణం జరిగింది. 11 ఏళ్ల మైనర్ బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి యత్నించాడు. బాలిక కుటుంంబం విజయవాడ వాగు సెంటర్‌లో నివాసముంటున్నారు. బంధువులతో కలిసి బాలిక ఆస్పత్రికి వెళ్లింది. అయితే ఆస్పత్రి నుంచి ఒంటరిగా వెళ్తున్న బాలికను ఆటో డ్రైవర్ బాల స్వామి (70) చూశాడు. తన ఇంటి దగ్గర దింపుతానని చెప్పి ఆటోలో ఎక్కించుకున్నాడు. బాలికను ఆటో డ్రైవర్ తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించాడు. పోలీసులు బాల స్వామిని అదుపులోకి తీసుకున్నారు.