అద్దంకి మండలం వెంపరాల గ్రామంలో మంగళవారం తాసిల్దార్ శ్రీ చరణ్ ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ సదస్సుల ప్రత్యేక అధికారి భీమయ్య పాల్గొని భూ సమస్యలపై వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సదస్సులో వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించడం జరుగుతుందని ఆయన చెప్పారు. మొత్తం 25 అర్జీలు వచ్చాయని భీమయ్య తెలియజేశారు.