నైతిక విలువలతో కూడిన విద్యను అందించాలి

79చూసినవారు
నైతిక విలువలతో కూడిన విద్యను అందించాలి
కొరిశపాడు మండలం మేదరమెట్ల లోని ప్రాథమిక పాఠశాల నందు గురువారం ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి పున్నయ్య పాల్గొని మాట్లాడారు. తొలుత ఆయన సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ప్రాథమిక దశ నుంచే నైతిక విలువలతో కూడిన విద్యాబుద్ధులు నేర్పించాలని అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్