పోలేరమ్మ తల్లికి పూజలు చేసిన గొట్టిపాటి హర్షవర్ధన్

548చూసినవారు
కొరిశపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో అద్దంకి ఉమ్మడి కూటమి అభ్యర్థి గొట్టిపాటి. రవికుమార్ కు మద్దతుగా వారి తనయుడు హర్షవర్ధన్ ఆదివారం ఉదయం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో గడప గడపకు తిరుగుతూ వచ్చే ఎన్నికలలో సైకిల్ గుర్తుపై ఓటు వేసి, అద్దంకిలో మీ రవి అన్నను మళ్లీ గెలిపించాలని, ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం గ్రామంలో ఎంతో విశిష్టత కలిగిన పోలేరమ్మ తల్లి దేవస్థానానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్