కొరిశపాడు మండలం మెదరమెట్ల పశువైద్యశాల పరిధిలోని పశు పోషకులందరూ డాక్టర్ సలహా మేరకు తమ జీవాలకు యాంటీబయటిక్స్ ను ఇవ్వాలని డాక్టర్ సైదయ్య ఆదివారం తెలియ చేశారు. ఇష్టానుసారంగా పశువులకు ఇచ్చే యాంటీ బైటిక్స్ వలన వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ప్రభావం మనుషులపై పడుతుందని ఆయన చెప్పారు. దీనివలన క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని డాక్టర్ సైదయ్య తెలియ చేశారు. కావున రైతులందరూ డాక్టర్ సలహాలు పాటించాలని కోరారు.