భార్యల వేధింపులతో భర్తలు సూసైడ్ చేసుకున్న ఘటనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇటీవల బెంగళూరులో సుభాష్ అనే టెకీ సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్న ఘటన మరవకముందే బెంగళూరులోనే మరో ఘటన చోటు చేసుకుంది. పోలీస్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న తిప్పన్న భార్య, అత్తమామలు వేధించడంతో సూసైడ్ నోట్ రాసి చనిపోయాడు. తిప్పన్న తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.