ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక సభను విజయవంతం చేయండి

82చూసినవారు
ఈనెల 22వ తేదీన ఒంగోలులో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా జరిగే మహాసభకు అద్దంకి నియోజకవర్గం నుంచి మాల సోదరులందరూ అధిక సంఖ్యలో తరలిరావాలని మాల మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మల్లెల వెంకట్రావు శుక్రవారం అద్దంకి మండలం అద్దంకిలో నిర్వహించిన మీడియా సమావేశంలో పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో ఉన్న కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు, కుల పెద్దలు ఈ సభలో భాగస్వామ్యులు కావాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్