అద్దంకి మండలం అద్దంకి పట్టణం పరిధిలోని 5, 14 వార్డుల్లో శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఆ శాఖ ఏఈ శివప్రసాద్ గురువారం పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు. విద్యుత్ స్తంభాలు తీగల మార్పుల వలన సరఫరాకు అంతరాయం కలుగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. వినియోగదారులు అందరూ సహకరించాలని కోరారు.