బాపట్ల జిల్లా పంగులూరు మండలంలోని రేణింగవరం గ్రామంలో శనివారం రెవెన్యూ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా తహసిల్దార్ సింగారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సులో రైతులు విరివిగా పాల్గొని అర్జీలు అందించారని అన్నారు. గ్రామంలో మొత్తం నాలుగు అర్జీలు వచ్చాయని అందులో ఒకటి వీధి ఆక్రమణకు గురైందని, దానిని కూడా పరిశీలించటం జరిగిందని తెలిపారు.