బాపట్ల: అర్జీలను పరిశీలించి సత్వరపరిష్కారం అందిస్తాం కలెక్టర్

79చూసినవారు
బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి , సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను వారు స్వీకరించారు. వారి సమస్యలను వినయంగా ఆలకించి అర్జీలను పరిశీలించి సంబంధిత శాఖలకు పంపి సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామని తెలిపారు.

సంబంధిత పోస్ట్