పిట్టలవానిపాలెం మండల పరిధిలోని చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భగళాముఖి అమ్మవారి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి భక్తులకు మహాగౌరి దర్శన భాగ్యం కల్పించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.