చిలకలూరిపేట పట్టణ టిడ్కో గృహ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ హరిబాబుకు వినతి పత్రం అందచేశారు. ప్రజాప్రతినిధులు మున్సిపల్ అధికారులు ప్రజా సమస్యలపై దృష్టి సారించి టిడ్కో గృహ సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.