సూపర్ సిక్స్ పాటు ఇతర ప్రభుత్వ పథకాలను దశలవారీగా అమలు చేస్తున్నామని, ఇప్పటికే చాలా సమస్యలు పరిష్కారం చేయడం జరిగిందని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. చిలకలూరిపేట తొమ్మిదో వార్డులో శనివారం ఆయన మాట్లాడుతూ. జగన్ రెడ్డి కబంధహస్తాల నుంచి రాష్ట్ర ప్రజలకు స్వేచ్ఛ లభించిందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఎవరు ఏం మాట్లాడినా బెదిరింపులు ఉండేవని, ఇప్పుడు అలాంటి బెదిరింపుల బెడద కూడా లేవన్నారు.