విశాఖ ఉక్కు పరిరక్షణకై యువజన, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం దీక్ష నిర్వహించడం జరిగింది. నరసరావుపేటలోని గాంధీ పార్క్ నందు యువజన, విద్యార్థి సంఘాల నాయకులు దీక్ష లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యువజన , విద్యార్థి సంఘాల నాయకులకు మద్దతుగా అఖిల భారత యువజన సమైఖ్యా చిలకలూరిపేట నియోజకవర్గ కన్వీనర్ బి. శ్రీను నాయక్ మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం 1325 రోజులుగా పోరాటం జరిగిందన్నారు.