కొత్తగా బాధ్యతలు స్వీకరించిన చిలకలూరిపేట, నాదెండ్ల, యడ్లపాడు మండలాల తహసీల్దార్లు షేక్ మహమ్మద్ హుస్సేన్, జీ విజయశ్రీ, ఏవీ రమణలు మాజీమంత్రి, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావును గురువారం కలిశారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటికి బొకేలు అందజేశారు. వారితో ప్రత్తిపాటి మాట్లాడుతూ ప్రభుత్వ ప్రతిష్ట పెంచేలా పనిచేయాలని సూచించారు. కార్యక్ర మంలో పార్టీ మండలాల అధ్యక్షుడు జువ్వాజి మదన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.