గేదె కొమ్ము పొట్టలో దిగబడటంతో చీరాలకు చెందిన టిడిపి నాయకుడు కౌతరపు జనార్ధన్ తీవ్రంగా గాయపడిన ఘటన శుక్రవారం రాత్రి చల్లారెడ్డి పాలెం వద్ద జరిగింది. ద్విచక్ర వాహనంపై బైపాస్ రోడ్డులో ఒంగోలు నుండి చీరాల వస్తున్న జనార్ధన్ గేదెల మందను దాటే క్రమంలో ఓ గేదె కొమ్ము విసరడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా జనార్ధన్ పరిస్థితి విషమంగా ఉండడంతో విజయవాడకు తరలించారు.