శ్రీ హనుమత్ వైభవం పేరిట చీరాల మున్సిపల్ బాయ్స్ హైస్కూల్ గ్రౌండ్స్ లో మంగళవారం రాత్రి నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు హాజరై రామాయణం విశిష్టతను భక్తులకు చెవులకు ఇంపుగా వివరించారు. సత్ప్రవర్తనకు, విధేయతకు రామాయణం ప్రతీకగా నిలుస్తుందని ఆయన చెప్పారు. శ్రీరామచంద్రమూర్తి, ఆంజనేయ స్వాములను భక్తులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యే కొండయ్య కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.