చీరాలలో పలు పెట్రోల్ బంకులలో గాలి మెషీన్లు పని చేయడం లేదని వాహనదారులు మండిపడుతున్నారు. చీరాల పరిసర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో పెట్రోల్ బంకులు ఉండగా ప్రతి రోజూ కొన్ని వేల లీటర్ల డీజిల్, పెట్రోల్ వినియోగం జరుగుతోంది. నిబంధనల మేరకు ప్రతి బంకులో గాలి మెషీన్లు ఏర్పాటు చేయాలి. కాని అవి ఉన్నప్పటికీ ఏ పెట్రోల్ బంకులోనూ గాలి మిషన్లు పని చేయడం లేదని వాహనదారులు వాపోయారు. ఈ విషయమై అధికారులు దృష్టి సారించాలన్నారు.