గంజిపాలెంలోని మదర్సా అన్వారుల్ ఉలూమ్ ఆధ్వర్యంలో గురువారం పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. మౌలానా అబ్దుల్ రహీం జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. మదర్సా విద్యార్థులు తెల్లని దుస్తులతో జాతీయ త్రివర్ణ పతాకాన్ని చేతబూని చీరాల పురవీధుల్లో త్రివర్ణ పతాకాలతో, దేశభక్తి నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించడం వీక్షకులకు విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ముఫ్తి మహమ్మద్ అబీద్, గని మహమ్మద్, సయ్యద్ జిలాని పాల్గొన్నారు.