బాపట్ల లోక్‌సభ స్థానంలో వైసిపి, టిడిపిలు స్థానిక ఎస్సీలకే టికెట్లు ఇవ్వాలని బుధవారం దళిత, ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మాచవరపు జూలియన్, ఎరుకల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ కుమార్ ధర్మ తదితరులు చీరాలలో మీడియాతో మాట్లాడుతూ వైసీపీ, టీడీపీ టిక్కెట్లు ఇచ్చిన నందిగం సురేష్, టి. కృష్ణప్రసాద్ స్థానికులు కాదని చెబుతూ పలు ఆరోపణలు చేశారు. ఆ అభ్యర్థులను మార్చాలని కోరారు.