గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జూడాలు సమ్మె చేస్తున్నప్పటికీ రోగులపై ఎలాంటి ప్రభావం కనిపించకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ చెప్పారు. జూడాలు సమ్మె చేస్తున్న నేపథ్యంలో శుక్రవారం అత్యవసర చికిత్స విభాగాన్ని ఆయన పరిశీలించారు. పలు వార్డులను తనిఖీ చేశారు. రోగుల వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా సీనియర్ వైద్యులను నియమించినట్లు ఆయన చెప్పారు.