నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ చిత్ర దర్శకుడు కొల్లి బాబీ, సంగీత దర్శకుడు తమన్ బుధవారం గుంటూరు నగరంలో సందడి చేశారు. చంద్రమౌళి నగర్ లోని రింగ్ రోడ్డులో వెల్కమ్ హోటల్ నుంచి రోడ్డులోని ఫినిక్స్ మాల్ వరకు అభిమానులతో కలిసి ర్యాలీగా వెళ్లారు. అనంతరం మైత్రి మూవీస్లో కలిసి డాకు మహారాజ్ చిత్రాన్ని తిలకించారు. అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని బాబీ గుంటూరుకు చెందిన వ్యక్తి కావడంతో బ్రహ్మరథం పట్టారు.