ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం నిర్వహించనున్నట్లు జడ్పీ చైర్ పర్సన్ కత్తెర హెన్రీ క్రిస్టినా తెలిపారు. ఈ సమావేశానికి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తో పాటు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు హాజరు అవుతారని తెలిపారు. జిల్లాలోని అన్ని శాఖలపై చర్చ జరుగుతుందని వెల్లడించారు.